Posts

Showing posts from July, 2022

రేపు భీమన అమావాస్య ఈ పండగ ఎలా ఎందుకు జరుపుకోవాలి దాని ఫలితం ఏంటి

Image
 రేపు భీమన అమావాస్య ఈ పండగ ఎలా ఎందుకు జరుపుకోవాలి దాని ఫలితం ఏంటి భీమన అమావాస్య దక్షిణ భారతదేశంలో జరుపుకునే పండుగ , ఎక్కువగా కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులలో.  నూతన వధూవరులు అమావాస్య రోజున జ్యోతిర్భేమేశ్వర వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని భర్త సంజీవిని వ్రతం అని కూడా అంటారు. భీముడి అమావాస్య శివుడిని పూజించే రోజు , తన భర్త దీర్ఘాయువు కోసం కరుణ కోరుతూ ఈ వ్రతం చేస్తారు. భీముడి అమావాస్యను వివాహిత మహిళలు మాత్రమే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరుపుకోవచ్చు. పెళ్లికాని ఆడవారు మంచి భర్తను ప్రసాదించమని దేవుడిని ప్రార్థిస్తారు మరియు వివాహిత స్త్రీ తన భర్త ఆయుష్షు పెరుగుటకు ఈ వ్రతం చేస్తారు.  *ఆరాధన విధానం* గృహిణులు తమ చేతులకు కంకణాలు ధరించి జ్యోతిర్భీమేశ్వరుడిని ధ్యానించాలి. ఉదయం లేదా సాయంత్రం ఏదైనా శుభ సమయంలో వ్రతాన్ని ఆచరించవచ్చు. అన్నం ఒక ప్లేట్ మీద పెట్టి , దానిపై రెండు దీపాలు వేసి , నూనె వెలిగించండి. పూజలతో కూడిన 9 గంటల గౌరీ దారాన్ని పూజించాలి. ముందుగా గణపతిని పూజించి , తర్వాత భీమేశ్వరుని పూజించారు. 9 రకాల నైవేద్యం పెట్టాలి.  ఆ తర్వాత భర్తకు పాదపూజ చేయాలి....

శ్రావణ మాసం విశిష్టత

Image
శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది. 🌼🌿*శ్రావణ సోమవారం* 🌼🌿 ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్...

సాష్టాంగ నమస్కారం...?

Image
 సాష్టాంగ నమస్కారం..... అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము... ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః... అష్టాంగాలు అంటే... "ఉరసా" అంటే తొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా" అనగా హృదయం, "వచసా" అనగా నోరు, "పద్భ్యాం" అనగా పాదములు, "కరాభ్యాం" అనగా చేతులు, "కర్ణాభ్యాం" అంటే చెవులు. ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి. 1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి. 2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి. 3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు...

తిరుమల శ్రీనివాసుడి అప్పు ఎంత ?

Image
తిరుమల శ్రీనివాసుడి అప్పు ఎంత ?  తిరుమల శ్రీనివాసుని వడ్డికాసులవాడు అని, చేసిన పాపాలను వడ్డీతో సహా స్వీకరిస్తాడని , శ్రీవారు హుండీ ధనాన్ని మొత్తం ఇంకా వడ్డీ రూపంలోనే జమచేస్తున్నాడనీ , ఇంకనూ వడ్డీకూడా తీర్చలేకపోతున్నాడని , కలియుగాంతానికి అసలు వడ్డీతో కలిపి కుబేరునికి ఋణాన్ని తీరుస్తాడనీ మనందరికీ తెలిసిన విషయమే! అసలు శ్రీనివాసుడు కుబేరుని వద్ద తీసుకున్న అపు ఎంత? ఎప్పుడు ? ఎందుకు తీసుకున్నాడు?ఎలా తీరుస్తానన్నాడు? ఇందుకు సాక్ష్యం ఏమైనా ఉందా ? దీని గురించి  భవిష్యోత్తరపురాణం 11 వ అధ్యాయం లో వివరించబడింది. ఋణ గ్రాహీ శ్రీనివాసో ధనదాయీ ధనేశ్వర: ; ఆత్మకార్య నిమిత్తం తు కళ్యాణార్ధం కలౌయుగే ౹  వైశాఖే శుక్లసప్తమ్యాం విలంబే చైవ వత్సరే ౹౹ నిష్కాణాం రామముద్రాణం లక్షాణి చ చతుర్దశ ౹  ద్రవ్యం దత్తం ధనేశేన వృద్ధి గ్రహణ కారణాత్ ౹౹  సవృధ్ధి దిత్సతామూలం స్వీకృతం చక్రపాణి నా ౹ వివాహ వర్షమారభ్య సహస్రాంతే పునః౹౹  దాతవ్యం యక్షరాజాయ శ్రీనివాసేన శార్ఞిణా ౹  ఏకసాక్షీ చతుర్వక్త్రో ద్వితీయస్తు త్రిలోచన:౹౹  తృతీయో౽శ్వత్థరాజాస్తు వేత్తి సర్వమిదం ధృఢం౹ ఇత్యేతదృణపత్రస్తు శ్రీనివాసో...