Posts

Showing posts with the label Devotional News

అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయా.. ఐతే ఈ గణపతిని ఇలా మొక్కండి

Image
అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయా...... ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోవడం, రావలసిన డబ్బులు, ఉద్యోగాలు, లాభాలు చేతిదాకా వచ్చి చేయిదాటిపోవడం జరుగుతోందా? అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం తరుణ గణపతిని పూజించడం. వినాయకుని ముప్ఫైరెండు రూపాలలో తరుణ గణపతి రూపం రెండవది. తరుణ అంటే యవ్వనం అని అర్థం. తరుణ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో విరాజిల్లుతాడు. ఈ రూపం లో స్వామికి ఎనిమిది చేతులు ఉంటాయి. కుడిపక్కన ఒక చేతిలో దంతాన్ని, మరొకచేత జామపండుని, ఒక చేత చెరుకు గడలని, మరొక చేత అంకుశాన్ని ధరించి ఉంటాడు. ఎడమవైపున ఒకచేత మోదకాన్ని, ఒకచేత వెలగ పండునీ,ఒకచేత లేత మొక్కజొన్న కంకుల పొత్తినీ, మరొక చేత వలనీ ధరించి ఉంటాడు. తరుణ గణపతి శరీరం కాంతివంతంగా ఎర్రని రంగులో ఉంటుంది. ఎరుపు ఉత్తేజానికీ యవ్వనానికీ ప్రతీక. మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్సుతో తరుణ గణపతి దర్శనమిస్తాడు. వినాయకునికి ప్రీతికరమైన బుధవారం నాడు, సంకష్ట చతుర్థినాడు, వినాయక చవితినాడు, దూర్వా గణపతి వ్రతం నాడు స్వామిని తరుణ గణపతి రూపం లో పూజించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. అనుకున్న కార్యాలు సత్వరం...

ముట్టుకొంటే మానవ శరీరం లాగా మెత్తగా అనిపించే శ్రీ నరసింహస్వామి వారు

Image
ముట్టుకొంటే మానవ శరీరం లాగా మెత్తగా అనిపించే శ్రీ నరసింహస్వామి వారు... తెలంగాణ      హేమాచల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మల్లూరు గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఉంది.     వరంగల్లు కి 130కిమి, భద్రాచలం కి 90  కిమి దూరంలో ఉంది.  ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు.     స్వామి విగ్రహం 10 అడుగుల ఎత్తు. స్వామి విగ్రహం రాయి తో చేసినా ఉదర భాగం మెత్తగా మానవ శరీరంలాగా ఉంటుంది.     స్వామి సకల కోరికలూ తీరిచే అద్భుత మహత్యం కల వారు.      అమ్మవార్లు ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి. క్షేత్ర పాలిక కి అష్టాదశ హస్తాలు          ఇక్కడ చింతామణి తీర్థంలోని నీళ్ళు సకల రోగ నివారణ చేయ గలవు.    ఇక్కడి ప్రజల కథనం ప్రకారం రావణుడు ఈ ప్రాంతాన్ని చెల్లెలు శూర్ఫనఖకి కానుకగా ఇచ్చాడు.     ఇక్కడే రాముల వారు ఖర దూషణాదులను మట్టు పెట్టారు.    అగస్త్యుల వారు ఈ ప్రాంతానికి హేమాచలమని పేరు పెట్టారు.     ఈ క్షేత్రం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది . చుట్టూ అడవి  మద్య...

సుప్రభాతంలో తెర వెనకాల ఏం చేస్తారు?

Image
   సుప్రభాత సేవ సమయంలో భక్తుల్ని బంగారువాకిలి ముందు నిలబెట్టి, ఆ వాకిలికి తెరవేసేసి, అలా కొంతసేపు వుంచేస్తారు. ఆ సమయంలో తెరవెనకాల గర్భాలయంలోఏం జరుగుతుంది. అన్నది భక్తులకి ఉత్కంఠ కలిగించే విషయం.  అక్కడ ఏం జరుగుతుందంటే... సుప్రభాత సేవను విశ్వరూపసేవ అనికూడా అంటారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ జరగడానికి ముందు గొల్ల మిరాశీదారు వెళ్లి అర్చకులను లేపడం, తర్వాత జియ్యంగారిని లేపడం, దివిటీలతో వారిని ఆలయానికి తీసుకురావడం సంప్రదాయం. ఆలయ అధికారులు, పూర్వకాలంలో పారుపత్తేదారు, ఇప్పుడు ఆలయం పేష్కారు (సహాయ కార్యనిర్వహణాధికారి) అయినాఈ సమయానికి ఆలయానికి రావాలి. అర్చకులు, ముఖ్యంగా గుడికి రాకముందే స్నానాదులు ముగించి, తమ కర్మానుష్ఠానం చేసిన తర్వాతే, ఆలయానికి రావాలన్నది నియమం. అదే నియమం జియ్యంగార్ల విషయంలో కూడా. ఎందుకంటే వీరిద్దరూ గర్భాలయంలోకి వెళ్లే అవసరంవుంది. వారిలో అర్చకునికే స్వామివారిని ముట్టే అవకాశం ఉంటుంది. జియ్యంగారు లేదా వారి తరఫున ఏకాంగులకు గర్భాలయంలోకి వెళ్లే అధికారమున్నా, వారికి స్వామి వారిని తాకే హక్కులేదు. ఆలయ అధికారులు, కావల్సిన దిట్టం (పూజకు కావాల్సిన సరంజామా) లెక్కప్రకారం ఇచ్చ...

నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి

Image
నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి      ఈ మధ్యకాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మములోనూ చెప్పబడలేదు. ఈమధ్యకాలంలో క్రొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని, దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తున్నాం అయిపోయింది అని ఇటువంటి భావజాలం క్రొత్తక్రొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ సత్యదూరాలు. ఆలయంలోనికి వెళ్ళే పూర్వమే కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే ఇంటిలోనుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి, పూలు, పూజాసామగ్రి తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి. నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని, తరువాత ప్రధాన దేవాలయానికి, అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఉప ఆలయాలలో ఇతర దేవీదేవతల దర్శనం చేసుకొని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్...

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

Image
 భగవధ్గీతలో ఏముంది?:  *ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?* గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్స రాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!! యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంవత్సరాలు జీవించి యున్నాడు!! భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా "మహా ప్రస్థానము" గావిస్తూ హిమాలయాలకు వెళ్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహానముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!! మహాభారత యుధ్ధము "కురుక్షేత్రము"లో 18రోజులుజరిగింది!! కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం చేసి పదవరోజున నేలకొరిగాడు!! 11వ రోజున అంటె మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో ధృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధం...

మంగళ సూత్రాలపై దేవుడి ప్రతిమలను వేసుకోవచ్చా?

Image
     *మంగళసూత్రం ఎలా ధరించాలి?*  భార్య మంగళసూత్రాన్ని ఎలా ధరిస్తే  భర్త సుఖంగా జీవిస్తాడు? పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త  తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి.       వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు.      సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని ఆ తర్వాత ఆడవారు మంగళ సూత్రంలో పగడాలు, ముత్యాన్నీ, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు.       అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. అది పొరపాటు. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీ...