ముట్టుకొంటే మానవ శరీరం లాగా మెత్తగా అనిపించే శ్రీ నరసింహస్వామి వారు

ముట్టుకొంటే మానవ శరీరం లాగా మెత్తగా అనిపించే శ్రీ నరసింహస్వామి వారు... తెలంగాణ


     హేమాచల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మల్లూరు గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఉంది.

    వరంగల్లు కి 130కిమి, భద్రాచలం కి 90  కిమి


దూరంలో ఉంది. 


ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు.


    స్వామి విగ్రహం 10 అడుగుల ఎత్తు. స్వామి విగ్రహం రాయి తో చేసినా ఉదర భాగం మెత్తగా మానవ శరీరంలాగా ఉంటుంది. 


   స్వామి సకల కోరికలూ తీరిచే అద్భుత మహత్యం కల వారు.  


   అమ్మవార్లు ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి. క్షేత్ర పాలిక కి అష్టాదశ హస్తాలు    


     ఇక్కడ చింతామణి తీర్థంలోని నీళ్ళు సకల రోగ నివారణ చేయ గలవు. 


  ఇక్కడి ప్రజల కథనం ప్రకారం రావణుడు ఈ ప్రాంతాన్ని చెల్లెలు శూర్ఫనఖకి కానుకగా ఇచ్చాడు. 


   ఇక్కడే రాముల వారు ఖర దూషణాదులను మట్టు పెట్టారు. 


  అగస్త్యుల వారు ఈ ప్రాంతానికి హేమాచలమని పేరు పెట్టారు. 


   ఈ క్షేత్రం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది . చుట్టూ అడవి  మద్యలో మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాల రమణీయంగా ఉంటుంది . 


   యోగానంద నరసింహ స్వామి మరియు లక్ష్మి దేవితో కొలువై ఉన్న ఈ క్షేత్రం లో హనుమ ద్వారా  పాలకుడై  ఉన్నాడు .


    చుట్టూ దట్టమైన కొండల పైన వెలసిన ఈ క్షేత్రం లో చింతమాని పుష్కరిణి ఉంది . కొండ పై నుండి  చింతమాని ధర ప్రవహిస్తుంది .ఎల్లప్పుడు ఇక్కడ నీరు ఉంటుంది . 


   భద్రాది నుండి  గోదావరి ఎదురుగా సుమారు 90-100 కి మీ  దూరం లో  గల మల్లూరు నరసింహ క్షేత్రం  ను హేమాచల లక్ష్మి నృసింహ క్షేత్రం (హేమాద్రి) అని  పిలుస్తారు


   ఈ క్షేత్రం చాల మహిమన్మితమైన క్షేత్రం మరియు  స్వామి ని దర్శించుకుంటే  అన్ని రకాల బాదలు ,దోషాలు  పోతాయని భక్తుల విశ్వాసం . 


      వైశాక  శుద్ధ పౌర్ణమి నుండి స్వామి వారి  కళ్యానోత్సవములు నిర్వహించబడును . చాల మంది  భక్తులు స్వామి వారి  కళ్యాణోత్సవానికి వస్తారు. 


వెళ్ళు మార్గం : -

మంగపేట్ కి సుమారు 5 కి మీ దూరం లో ఉన్న ఈ క్షేత్రం ఎటూరునాగారం -భద్రాచలం వెళ్ళు మార్గం లో 

వస్తుంది .


Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి