Posts

Showing posts with the label Suprabhatha Seva

సుప్రభాతంలో తెర వెనకాల ఏం చేస్తారు?

Image
   సుప్రభాత సేవ సమయంలో భక్తుల్ని బంగారువాకిలి ముందు నిలబెట్టి, ఆ వాకిలికి తెరవేసేసి, అలా కొంతసేపు వుంచేస్తారు. ఆ సమయంలో తెరవెనకాల గర్భాలయంలోఏం జరుగుతుంది. అన్నది భక్తులకి ఉత్కంఠ కలిగించే విషయం.  అక్కడ ఏం జరుగుతుందంటే... సుప్రభాత సేవను విశ్వరూపసేవ అనికూడా అంటారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ జరగడానికి ముందు గొల్ల మిరాశీదారు వెళ్లి అర్చకులను లేపడం, తర్వాత జియ్యంగారిని లేపడం, దివిటీలతో వారిని ఆలయానికి తీసుకురావడం సంప్రదాయం. ఆలయ అధికారులు, పూర్వకాలంలో పారుపత్తేదారు, ఇప్పుడు ఆలయం పేష్కారు (సహాయ కార్యనిర్వహణాధికారి) అయినాఈ సమయానికి ఆలయానికి రావాలి. అర్చకులు, ముఖ్యంగా గుడికి రాకముందే స్నానాదులు ముగించి, తమ కర్మానుష్ఠానం చేసిన తర్వాతే, ఆలయానికి రావాలన్నది నియమం. అదే నియమం జియ్యంగార్ల విషయంలో కూడా. ఎందుకంటే వీరిద్దరూ గర్భాలయంలోకి వెళ్లే అవసరంవుంది. వారిలో అర్చకునికే స్వామివారిని ముట్టే అవకాశం ఉంటుంది. జియ్యంగారు లేదా వారి తరఫున ఏకాంగులకు గర్భాలయంలోకి వెళ్లే అధికారమున్నా, వారికి స్వామి వారిని తాకే హక్కులేదు. ఆలయ అధికారులు, కావల్సిన దిట్టం (పూజకు కావాల్సిన సరంజామా) లెక్కప్రకారం ఇచ్చ...