శఠగోపం వెనక దాగివున్న రహస్యం?
శఠగోపం వెనక దాగివున్న రహస్యం? శఠగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తారు. ఆలయ పూజారి శఠారిని తీసుకువచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహ బుద్ధులు నశిస్తాయని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలని పండితులు చెబుతారు. భగవంతుడి పాదాల చెంత మన కోరికలు.. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాలవారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. భక్తులు దేవాలయంలో ప్రదక్షిణలు చేసి దర్శనమయ్యాక తీర్థం, శఠగోపం తీసుకుంటారు. శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైనవాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. ఇది తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తా...