అరుంధతి మహా పతివ్రత నక్షత్రంగా ఎందుకు మారింది?
అరుంధతి నక్షత్రం..కథ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు.అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత. ఇసుకను అన్నంగా తయారు చెయ్యగలరా..? అరుంధతి గురించి చాలా కథలున్నాయి. అందులో కొన్ని…వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు…. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వశిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. “ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా?” అని అడిగాడు.అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.*పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. నేను చేస్తానండి” అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అం...