ఈ మంత్రం పోయినవాటిని తిరిగి తెస్తుంది
ఈ మంత్రం పోయినవాటిని తిరిగి తెస్తుంది
ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా ఒకేఒక మంత్రం *’నిరంతరం’* స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి.
*ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే కార్తవీర్యార్జున మంత్రం.*
స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి.
డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా ‘మొత్తానికి సమస్య ఏదైనా’ పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు మన పండితులు.
*ఆ మంత్రం ఈ విధం ఉంటుంది:*
*ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్*
*తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే*
ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ.
స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు.
కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు.
చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు.
*అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు.*
ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.

Comments
Post a Comment