దేశ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఎక్కడ ఉంది ? పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏ స్థానంలో ఉంది : రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి



తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి


ఎవరు ఎవరికి ఆదర్శం ?

గుజరాత్ రాష్ట్రం 1960లో ఏర్పాటయింది. ఇప్పటికి 62 ఏళ్లయింది .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం ఎనిమిదేళ్లయింది

కానీ నేడు గుజరాత్ లో కరంటు కోతలతో రైతులు రోడ్డెక్కారు .. ఎనిమిదేళ్ల తెలంగాణలో కరంటు కోతలు లేవు

దేశ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఎక్కడ ఉంది ? పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏ స్థానంలో ఉంది ?

రాజకీయ యాత్రలు చేస్తూ కొంత మంది అవాకులు పేలుతున్నారు .. తెలంగాణకు సహనం ఎక్కువ .. సమయం వచ్చినప్పుడు బండకేసి కొడుతుంది

తెలంగాణ వృద్ది రేటు 11.7 శాతం .. దేశ వృద్ది రేటు 6.59 శాతం

తెలంగాణ వ్యవసాయ వృద్ది రేటు 21 శాతం

విద్యుత్ వినియోగంలో , పెట్టుబడుల ఆకర్షణలో, అభివృద్దిలో, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలో నంబర్ వన్ 

మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి తెలంగాణ మాదిరిగా ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలులో లేవు

బీజేపీ నేతలది అవగాహన లేని అపరిపక్వత 

తెలంగాణ ప్రజలు పప్పు పెట్టుకున్నా అందులో పోపు మాదే అంటారు బీజేపీ నేతలు

ఏడేళ్లలో తెలంగాణ నుండి కేంద్రానికి రూ.3,65,787 కోట్లు వెళ్లాయి .. తిరిగి వచ్చింది కేవలం రూ.1,68,647 కోట్లు మాత్రమే

గ్రామాలలో వైకుంఠధామం కనిపించినా అది మాదే అని బీజేపీ నేతలు అంటున్నారు .. మరి మీ పాలిత రాష్ట్రాల్లో ఇవి ఎందుకు లేవు ?

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ ప్రజలను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు

మేకిన్ ఇండియా నినాదం చూడడానికి ఎంతో ఆకర్షణీయం ..కానీ చైనా నుండి అత్యధిక  దిగుమతుల శాతం పెరిగింది

తయారీరంగంలో 17.4 శాతం ఉన్న వాటా 25 శాతానికి పెంచుతామని మోడీ ప్రకటించారు .. కానీ అది 14.3 శాతానికి పడిపోయింది

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తామన్నారు అది శుద్ద అబద్దం

తయారీ రంగంలో 2016లో 5 కోట్లు ఉన్న ఉద్యోగాలు ప్రస్తుతం 3 కోట్లకు పడిపోయాయి

ప్రభుత్వరంగ సంస్థలను హోల్ సేల్ గా అమ్మేశారు .. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల సంగతి పక్కనబెడితే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి

15.62 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఖాళీగా ఉంటే భర్తీచేసింది కేవలం 4.45 లక్షలు మాత్రమే

ప్రపంచస్థాయి సూచీలలో  ప్రజాస్వామ్య సూచీ, మానవ అభివృద్ది సూచీలో, పౌరహక్కులు వ్యక్తిగత స్వేచ్చ, చట్టాల అమలులో, మీడియా స్వేచ్చ, మహిళాభద్రత సూచీ, ఆర్థిక పరివర్తన సూచీ, జీవించే హక్కు, ఆహారభద్రత సూచీ వంటి అన్ని రంగాలు మోడీ పాలనలో తిరోగమనంలో ఉన్నాయి

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు

ప్రభుత్వరంగ సంస్థలను నిస్సిగ్గుగా అమ్మేస్తున్నారు

ఈ ఆర్థిక తిరోగమనాన్ని గమనించి ఆర్థికవేత్తలు ఈ ఏడేళ్లలో అనేకమంది రాజీనామా చేశారు

ఆర్డీై గవర్నర్లు రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్  విరల్ ఆచార్య, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం, నీతి అయోగ్ వైస్ చైర్మన్లు అరవింద్ పనగారియా, రాజీవ్ కుమార్, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు  సుర్జీత్ బల్లా, జాతీయ గణాంకల కమీషన్ సభ్యులు  పీసీ మోహనన్, జేవీ మీనాక్షి లు పదవీకాలానికి ముందే రాజీనామా చేశారు. కరోనా సమయంలోనే ప్రముఖ వైరాలజిస్టులు గంగా దీప్ కంగ్, షాహిద్ జమీల్ లు తమ బాధ్యతల నుండి తప్పుకున్నారు 

ఏరికోరి మోడీ  నియమించుకున్న వారు మధ్యలోనే పదవులు వదిలేశారు .. వారు దేశ తిరోగమనంపై, మోడీ విధానాలపై అవేదన వ్యక్తంచేశారు

తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించుకున్నా తెలంగాణ తన మానాన తను జీవిస్తున్నది .. దేశానికే తలమానికంగా జీవిస్తున్నది

సహకారం అందించకపోగా కేంద్రం తెలంగాణ మీద పడి ఏడుస్తున్నది

ప్రజలకు ఉపయోగపడే యాత్రలంటే  రైతు బంధు దేశంలోని ప్రతి రైతుకు అందజేయాలని, కాళేశ్వరం  రైతభీమా ప్రతి రైతుకు వర్తింపజేయాలని, పాలమూరు రంగారెడ్డికి జాతీయహోదా ఇవ్వాలని, ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరానికి ఎందుకు సాయం చేయలేదని, మహిళా యూనివర్శిటీ ఎందుకు ఇవ్వలేదని, గిరిజన యూనివర్శిటీ ఎందుకు ఇవ్వలేదని, దేశంలో 157 మెడికల్ కళాశాలలు ఇచ్చి తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదని యాత్రలు చేయాలి. కేంద్రాన్ని నిలదీయాలి

దేశాన్ని ఏలుతున్న మోడీ ప్రభుత్వం దేశంలో ఏ వర్గానికి ఒక మంచిచేసిన దాఖలాలు లేవు

అద్భుతమైన రీతిలో అబద్దాలు చెబుతున్న ప్రభుత్వంగా మోడీ సర్కారు నిలిచిపోతుంది

ఒకరు మతపరమైన విద్వేషాలు రేపాలని, ఒకరు తెలంగాణ మీద అడ్డగోలుగా సంపాదించుకుని కేసీఆర్ ను విమర్శిస్తూ మోడీ గురించి మాట్లాడకుండా యాత్రలు చేస్తున్నారు

 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావమే ఒక అద్భుతం


కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ పోరాటం ప్రపంచ ఉద్యమాలకు ఆదర్శం

ఈ స్థితికి కారణమైన ఉద్యమకారులు, అమరులకు, వారి కుటుంబాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం

ప్రజాస్వామ్యంలోని ప్రతి మలుపులో త్యాగాలు, విద్రోహాలు ఉంటాయి

అన్నింటిని అధిగమిస్తూ బలీయమైన పార్టీగా నిలబడ్డాం .. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తున్నది

తెలంగాణ సమాజం కోసం తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను మోస్తూ ముందుకు సాగుతున్నాం

తెలంగాణ పీర్ల పండుగ, బోనాలు ఒకే మాదిరి చేసుకుంటుంది .. అమరుల స్థూపం వద్ద గింజలు తినే పావురాలను అడిగితే ఈ విషయం చెబుతాయి

తెలంగాణ వ్యతిరేకులకు సమాజం ఖచ్చితంగా  గుణపాఠం చెబుతుంది

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు జడ్పీ చైర్మన్ పద్మావతి, జోగుళాంబ గద్వాల జడ్పీ చైర్మన్ సరిత, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి







Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి