#తొర్రూరులో ప్రతి రోజూ మంచినీటికి 25కోట్లు!
#ఏడాదిలోగా పట్టణానికి 24 గంటల మంచినీరు
#మరింత సర్వాంగ సుందరంగా తొర్రూరు అభివృద్ధి!!
#తొర్రూరు పట్టణంలో అభివృద్ధి జాతర
#కనీవినీ ఎరగని రీతిలో పట్టణంలో అభివృద్ధి పనులు
#ఒకే రోజు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు పనులకు శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ లోని 16 వార్డుల్లో ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున నిధులతో సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువల పనులకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
వార్డుల వారీగా వాడవాడలా పండుగ వాతావరణం
అడుగడుగునా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కి పుష్పాభిషేకం చేస్తూ, మంగళహారతులు, మేళతాళాలతో, కోలాటాల తో ఘన స్వాగతం పలికిన మహిళలు
ఈ సందర్భంగా పలు వార్డులలో TRS లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు
5వ వార్డు నుంచి 19 మంది బీజేపీ ముఖ్య నాయకులు పి యాకన్న, ఉపేందర్ ల నేతృత్వంలో టీఆరెఎస్ లో చేరికలు
ఏడాదిలోగా తొర్రూరు పట్టణంలో ప్రతి రోజూ 24 గంటల పాటు మంచినీటని అందించేందుకు ప్రణాళికలు సద్ధమయ్యాయని, ఇందు కోసం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. *మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ లోని 16 వార్డుల్లో ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున నిధులతో సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఒకే రోజు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు పనులకు శ్రీకారం చుట్టడంతో తొర్రూరులో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటికి మించి తొర్రూరు మున్సిపాలిటీని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశాం. ఈ దారిలో వెళ్ళేవాళ్ళు తొర్రూరును చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఈ ఆరున్నరేండ్లలోనే జరిగింది. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, 0సిఎం కెసిఆర్ ఇచ్చిన అవకాశం, మంత్రి కెటిఆర్ సహకారంతో తొర్రూరు రూపురేఖలనే మార్చామన్నారు. ఇందులో భాగంగానే అమృత్ కార్యక్రమం కింద 25 కోట్ల రూపాయలను మంజూరు చేశారని, ఇది సిఎం కెసిఆర్, కెటిఆర్ ల దయ వల్ల సాధ్యమైందన్నారు. ఏడాదిలోగా తొర్రూరు పట్టణంలో 24 గంటల పాటు మంచినీటిని సరఫరా చేస్తామని ప్రజల కరతళా ధ్వనుల మధ్య మంత్రి ప్రకటించారు.
అలాగే త్వరలోనే 57 ఏండ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తామన్నారు. ఇండ్ల స్థలాలున్న వాళ్ళకి తప్పకుండా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అందచేస్తామన్నారు. అందరినీ సంతృప్తి పరచడం కష్టమైనా, దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తూన్నామని చెప్పారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇప్పటికే ఎంతో చేశామని, ఇంకా చేయాల్సింది మిగిలే ఉందని, అవన్నీ పరిష్కరించే బాధ్యత తనదన్నారు. సిఎం గారి ఆశిస్సులతో అనితర సాధ్యమైన అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు.
తొర్రూరు పట్టణంలో అభివృద్ధి జాతర
తొర్రూరు పట్టణంలో మంగళవారం అభివృద్ధి జాతర జరిగింది. ఈ ఉదయం 8 గంటల నుంచి కలెక్టర్, కమిషనర్, వివిధ శాఖల అధికారులు వెంటరాగా, మున్సిపల్ చైర్మన్, ఇతర కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమక్షంలో మంత్రి నాన్ స్టాప్ గా ప్రతి వాడ వాడలా తిరుగుతూ శంకుస్థాపనలు చేశారు. అలాగే ప్రజలతో కలిసి వారి సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ బిజీబిజీగా గడిపారు.
కనీవినీ ఎరగని రీతిలో పట్టణంలో అభివృద్ధి పనులు
కాగా, పట్టణంలో గతంలోఎన్నడూ లేని విధంగా అభవృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి వాడకు అభివృద్ధి పనులు ఉండటంతో ప్రత్యేకించి మహిళలు భారీ ఎత్తున ఈ అభివృద్ధి జాతరలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అడుగడుగునా మంత్రికి ఘన స్వాగతం
అడుగడుగునా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కి పుష్పాభిషేకం చేస్తూ, మంగళహారతులు, మేళతాళాలతో, కోలాటాల తో మహిళలు ఘన స్వాగతం పలికారు. గట్టిగా అభివృద్ధి నినాదాలు చేశారు. పట్టణమంతా పూలు, బ్యానర్లతో అందంగా అలంకరించారు.
టిఆర్ ఎస్ లో చేరికలు
ఈ సందర్భంగా పలు వార్డులలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు TRS లో చేరారు. 5వ వార్డు నుంచి 19 మంది బీజేపీ ముఖ్య నాయకులు పి యాకన్న, ఉపేందర్ ల నేతృత్వంలో టీఆరెఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారిని మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే సంస్కృతి ఒక్క టిఆర్ఎస్ లోనే ఉందన్నారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ శశాంక, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఇతర సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు





Comments
Post a Comment