గాయత్రి దేవి అంటే ఎవరు..? గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు. మహా శక్తి వంతమైన గాయత్రి మంత్రాక్షరాలు. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం...డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతున్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు. గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు: 01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు. 02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. 03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత ...
Comments
Post a Comment