ఇక్కడ శివలింగం కింద 365 రోజులు నీరు ఉరుతూనే ఉంటుంది

                                     ఇక్కడ శివలింగం కింద 365  రోజులు నీరు ఉరుతూనే ఉంటుంది

బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. సూర్య చంద్రులు ఎలాగో భగవంతుడు ఒక్కడేనని ఆ భగవంతుడు శివుడేనని హిందువులు గట్టిగా నమ్ముతారు.


ఈ భూమి మీద ఆ పరమేశ్వరుడు లేని చోటు, శివుడు లేని వస్తువు, శివుడు లేని ప్రాణి లేదని అందరిలోనూ శివుడున్నాడని అదే అద్వైత తత్వమని హైందవ సంస్కృతి తెలియజేస్తుంది. ఈ ముక్కోటి దేవుళ్ళకు ఆదిదంపతులైన శివపార్వతులు మన దేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలున్నాయి. వాటిలో వేటికవే ప్రత్యేకమైనవి. 


ఒక్కో ఆలయానానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్ని ఆలయాల్లో ఒకటి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అత్యంత మహిమాన్వితమైనది.



అందమైన శిల్పకళా నిలయం జిల్లా కేంద్రం అనంతపురంకు 57కిలోమీటర్ల దూరంలో కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా తాడిపత్రి ఉంది. 


ఆ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..



ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగంలో శ్రీరామ చంద్రుడి చేతి ప్రతిష్టింపబడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. భక్తుల నుండి పూజలందుకుంటున్న రామలింగేశ్వరుడి ప్రతిమ త్రేతాయుగం కాలం నాటిది.


 బ్రహ్మణుడైన రావణుడిని చంపడంల వల్ల వచ్చే పాపం నుండి విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామ చంద్రుడే దేశంలో చాలా చోట్ల శివలిగాలను ప్రతిష్టించారు, అలా ప్రతిష్టింపబడిన శివలింగాలలో ఇది కూడా ఒకటని ఆలయ పూజారులు కథనం.


విజయనగర రాజులు అంటే కళలకు అత్యంత గౌరవమిస్తారు. రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా అంతే అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన ఘనత వారికే ఉంది.

భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుడిరి దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో అలాగే ఆలయ గోడల మీదున్న ఈ శిల్పాలకు అంతే మంత్రముగ్ధులవుతారు.


 రామాచారి అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.



ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో పాటు ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత ఇక్కడి శివలింగం. అన్ని చిన్న పెద్ద దేవాలయాలలో ఉన్నట్లుగా కాకుండా ఇక్కడి శివలింగం ఒక ప్రత్యేక ఆకారంలో ఉంది.


అలాగే ఏడాదిలో 365 రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతునే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊట. 

వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడినది.

పేరుకు పరమశివుడి దేవాలయమే అయినా ఈ గుడిలో మిగిలిన దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. 

ఈ బుగ్గు రామలింగేశ్వార ఆలయం పెన్నానది పడమటి తీరంలో ఉంది. ఆ ఆలయానికి శిథిలమైన మూడు ప్రాకార గోపురాలున్నాయి. శిథిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగంలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.

ప్రధాన ద్వారం నుండి లోపలికి వె


ళ్ళేటప్పుడు లోపలి కుడిప్రక్కన గోపురంలో బాగంగానే మరో రెండు దేవాలయాలు కోదండ రామ స్వామి ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారంతో ఉంటే, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగి ఉంది. వీరబద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉంది.

ఇక్కడ స్థానికంగా దొరకే నల్లరాతితో ఆనాటి శిల్పులు అద్భుతమైన శిల్ప సంపదకు ప్రాణం పోశారు. కొంత ఖుజురహో శైలిని మరికొంత హంపీ శిల్పకళను చూడవచ్చు. శ్రీమహావిష్ణువు దశావతారాలను మనోహరంగా మలచారు శిల్పలు. ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి మొదలు ఫ్గాుణమాసం శుద్ధ తదియ వరకు 11 రోజులపాటు రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి

Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి