టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించిన అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగం

 టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించిన అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగం



60 లక్షల మంది తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు


తెలుగుజాతి చరిత్రలో ఇద్దరు మహనీయులు రాజకీయాలను మలుపు తిప్పారు


స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్ర సృష్టిస్తే, మన కేసీఆర్ గారు చరిత్రతో పాటు...రాష్ట్రాన్ని సృష్టించారు


ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటే, రాష్ట్రాన్ని తేచ్చిన వారే మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు


తెలంగాణ ప్రజల ప్రత్యేక ఆకాంక్ష రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కెసిఆర్ గారి జన్మ ధన్యమని అప్పటి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ తెలిపారు


నా జీవితంలో గొప్ప ఆందోళనకారులను గొప్ప పరిపాలకులను చూశాను కానీ ఒక ఆందోళన కారుణిగా, ఒక గొప్ప పరిపాలకునిగా ఉన్న వ్యక్తి కెసిఆర్ గారి అని  అరుణ్జైట్లీ అన్నారు


ఈరోజు తెలంగాణ ఆచరిస్తున్నది, రేపు దేశం తప్పక ఆచరించాల్సిన పరిస్థితి వచ్చే గొప్ప స్థాయికి మనరాష్ట్రం చేరుకుంది


75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేక మంది పరిపాలకులున్నా... రైతులకు వ్యవసాయ రంగానికి, రైతుబంధు లాంటి కార్యక్రమంతో అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చిన పాలకులు ఎవరు లేరు


తెలంగాణ పథకాలు రైతుబంధు, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్ వంటి అనేక కార్యక్రమాలను కేంద్రం కాపీకోడుతుంది.... 


ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా ను తలదన్నే వేగంతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు... 


వలస పోయిన పాలమూరు ను తిరిగి తీసుకు వచ్చినా...

దశాబ్దాల ఫ్లోరోసిస్ తరిమికొట్టినా...

వర్గ మత విభేదాలు లేకుండా... అభివృద్ధి కొనసాగుతుందన్నా

ఇదంతా కెసిఆర్ గారి నాయకత్వం వల్లనే సాధ్యమైంది...


ఇప్పుడు భారతదేశానికి తెలంగాణ మోడల్ కావాలి


భారతదేశానికి బంగారు తెలంగాణ మోడల్ ని పరిచయం చేయాలి...


లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలున్న తలసరి ఆదాయం 278000 పెరిగింది...


రాష్ట్ర gsdp రెట్టింపు అయింది...


తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు బిజెపి నాయకత్వంలోని భీమారు రాష్ట్రాలకి అందుతున్నాయి...


మత పిచ్చి లేని, కుల పిచ్చి లేని పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న.... విశ్వమానవ సౌభ్రాతృత్వమే తెలంగాణ మోడల్


తెలంగాణది అద్భుతమైన సాఫల్య చరిత్ర అయితే, బిజెపిది, కేంద్రానిది అంతులేని వైఫల్యాల చరిత్ర


2020 నాటికి భారత రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు... కానీ రైతుల కష్టాలు కన్నీళ్లు రెట్టింపు అయ్యాయి... తన అస్మదీయులకు కోసం రైతులను అరిగోస పెట్టిండు మోడీ...


ఈరోజు నరేంద్ర మోడీ అంటే...రైతు విరోధి అని దేశం అంటున్నది


2022 నాటికి నిరుపేదల అందరికీ ఇల్లు ఇస్తామన్నాడు... కానీ తన దివాలాకోరు ఆర్థిక విధానాలతో, పన్నుల పెంపు తో ఉన్న ఇల్లును అమ్ముకునే పరిస్థితి వచ్చింది...


నల్లధనం అంటే మోడీ తెల్లమొహం వేస్తున్నారు


ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఎనిమిది ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇయ్యయాల్సింది పోయి.... ఉన్న ఉద్యోగాలను పడగొట్టి, ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారు... పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగం అని చెప్పి దభాయి స్తున్నాడు


సిలిండర్ వెయ్యి అయింది... మహిళలకు మళ్లీ కట్టెలు పోయ్యే దిక్కు అయింది


లోకల్ ఫర్ వోకల్ అనే నరేంద్రమోడీ తెలంగాణ సాధించిన విజయాలను కట్టిన ప్రాజెక్టులకు గురించి ఒక్క మాట చెప్పరు.... తెలంగాణ విజయాలు దేశం విజయాలు కావా..


ఆత్మ నిర్భర్ భారత్ అంటు మనో నిబ్బరం కోల్పోయే విధంగా చేస్తున్నారు...


హర్ ఘర్ జల్ అనే మోడీ... ప్రతి ఇంటిలో జహర్ ను నింపుతున్నారు


20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ పేరెత్తితే అది ఒక జుమ్లా అంటారు


దేశభక్తి పేరు చెప్పి దేశంలోని సంస్థలను అమ్ముతున్నారు... భేచో ఇండియా అంటున్నారు


ఇప్పుడు కావాల్సింది ఉద్వేగ భారతం కాదు... ఉద్యోగాల భారతం...


గంగను శుద్ధి చేస్తామని చెప్పి... శవాల కుప్పలు చేసిండు మోడీ


గాంధీ విలువలు వల్లెవేస్తూ గాడ్సే మద్దతుదారులకు పరోక్షంగా మద్దతు పలుకుతాడు


తలా తోక లేని దౌత్యం విధానంతో ప్రపంచం ముందు నవ్వుల పాలు చేస్తున్నడు


అన్ని దరిద్రమైన విషయాల్లో మోడీ దేశాన్ని నెంబర్ వన్ లో స్థానంలో నిలిపాడు...


ప్రపంచంలోనే అత్యధిక సిలిండర్ ధర ఉన్న దేశం భారతదేశం


మానవ అభివృద్ధి సూచిక... వరల్డ్ హంగర్ ఇండెక్స్లో... హ్యాపీనెస్ ఇండెక్స్... మహిళా రక్షణ సూచిక.. వంటి అన్ని అంశాల్లో భారతదేశ ర్యాంకులు దిగజార్చింది మోడీ 


ఈ ప్రభుత్వం ఎన్ డి ఏ కాదు... నాన్ పర్ఫామెన్స్ ఆసెట్ npa ప్రభుత్వం


Sabka sath sabka vikas కాదు... కేంద్రంలో విద్వేషం నాలుగు పాదాలపై నడుస్తున్నది...


మోడీ hai tho mumkin hai కాదు మోడీ hai mushkil hai...


ఇంకా ఎన్నిరోజులు భారతదేశం ఎదుగుతున్న దేశంగా ఉండాలి...


కుల పిచ్చి మత పిచ్చి రెచ్చగొట్టే సంస్థలు ఎందుకు ఉండాలి...


నా పేరు చెప్పి పొట్లాడండి అని ఏ దేవుడు చెప్పిండు...


ఇంకా ఎన్నిరోజులు పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పోల్చుకొని మురిసిపోతాం..


40 ఏళ్ల కింద అ సమానంగా ఉన్నా భారత్-చైనా... ఇప్పుడు చైనా ఎక్కడ ఉంది...భారత్ ఎక్కడ ఉంది...


అందుకే...


మేరా భారత్ మహాన్ అనే నాయకుని భారతదేశం కోరుతున్నది...


బహుశా ఆ నాయకత్వాన్ని తెలంగాణనే అందిస్తుందేమో


దేశానికి ఒక విజనరీ కావాలి టేలివిజనరి కాదు.


భారత దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి.


కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరం.


తెలంగాణ లాంటి వ్యవసాయ అనుకూల పథకాలు.. సంక్షేమ పథకాలు కావాలి...


బుల్డోజర్ మాడలు... బిల్డప్ మోడల్... గోల్ మాల్ గుజరాత్ మోడల్ కాదు... తెలంగాణ మోడల్ కావాలి


ఇందుకోసం తెలంగాణను విజయవంతంగా ముందుకు నడిపిన కెసిఆర్ గారి నాయకత్వం దేశానికి కావాలి











Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి