మీ పిల్లలు మాట వినడం లేదా? ఐతే ఇలా చెయ్యండి మంచి ఫలితాలు చూస్తారు
* ఉత్తమ ఫలితాలు కొరకు పరిహారాలు*
1.నాలుగు చిన్న మేకులు తీసుకుని నృసింహ మంత్రాన్ని చెబుతూ మీ సింహ ద్వారానికి ఇరుప్రక్కలా దించేయండి. ఎలాంటి దుష్టాత్మలు ఇంట్లోకి ప్రవేశించవు.
2.ఇంట్లోకి వచ్చేముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవకండి.
3.మీ పిల్లలు మాట వినడం లేదా?ఆదివారం అష్టాక్షారీ మంత్రంతో వారిపై నుండి ఒక బూరు కొబ్బరి కాయను తిప్పి కూడలిలో పారవేయండి.
4.ఇంట్లో డబ్బు నిలవకుంటే నాలుగు గచ్ఛకాయలు లక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిదిసార్లు చేసి బీరువాలో పెట్టండి.
5.ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడేవారు భైరవుని పేరుమీద కొంచెం మద్యాన్ని తీసుకొని భైరవాష్టకాన్ని చదివి తాగేవారికి ఇవ్వండి.
*పరిహారాలు*1.తాంబూలంలో కొద్దిగా జాజికాయను కలిపి వేసుకోవడం ద్వారా ముఖంలో చక్కని వర్చస్సుని పొందగలరు,
2.కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని భైరవమంత్రం చదువుతూ మీ యింటికి ఎనిమిది పక్కలా చల్లండి,భైరవుడు మీకు రక్షణ గా ఉంటాడు,
3.కొద్దిగా పాతబెల్లం తీసుకొని ముద్దలా చేసి పదకొండు లవంగాలు గుచ్చి నైఋతిలో పాతి పెట్టండి.ఇంటికి పీడలు తొలగిపోతాయి.
4.శుక్ర వారం రాహుకాలంలో రెండు రొట్టెలు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి.రాహుగ్రహ దోషాలనుండి విముక్తి లభిస్తుంది.
5.గణపతి ప్రీతి కొరకు మీకు వీలయినపుడల్లా పిల్లలకు తీపి పదార్థాలు పంచండి

Comments
Post a Comment