నవగ్రహాలు ప్రధానంగా శివాలయాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకు?
నవగ్రహాలు అనేవి ప్రధానంగా శివాలయాల్లోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి కారణం...
నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవతలను నియమించింది శివుడే. దీంతోపాటు గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడుకి అధి దేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశాను సారమే సంచరిస్తూ వుంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి.
ఆది దేవుడైన పరమశివుడి అనుగ్రహమే ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలా మంది భక్తులు శివాలయాల్లో నవగ్రహ పూజ చేసినా చేయకున్నా, శివునికి మాత్రం కచ్చితంగా అభిషేకం లేదా అర్చన చేయిస్తారు.

Comments
Post a Comment