వీటిని అవమానిస్తే చావుకు దగ్గరైనట్లే!

                                వీటిని అవమానిస్తే చావుకు దగ్గరైనట్లే!

    అష్టాదశ పురాణాల్లో ఒకటి భాగవత పురాణం. దీన్ని శ్రీమద్భాగవత మహా పురాణం అంటారు. అలాగే భాగవతం అని కూడా పిలుస్తారు.

     హిందువులకు ఇది గొప్ప గ్రంథం. మొదట సంస్కృతంలో రచించిన ఈ గ్రంథం ప్రస్తుతం అన్ని భారతీయ భాషల్లోనూ లభ్యమవుతుంది. కృష్ణ తత్వాన్ని గురించి భాగవతం తెలియజేస్తుంది. ఆది శంకరుల అద్వైత్వం దీనిలో మిళితమై ఉంది. ఇతర పురాణాల్లో కంటే భాగవత పురాణంలో వంశవృక్షం, పురాణాలు, భూగోళ శాస్త్రం, విశ్వోద్భవ శాస్త్రం, నృత్యం, సంగీతం, యోగా, సంస్కృతి లాంటి అనేక విషయాలను విస్తృతం గా చర్చించారు. రాక్షసుల అలజడులు, దేవాసుర యుద్ధాలు, విశ్వాన్ని నాశనం చేయడానికి అసురుల ప్రయత్నాలను శ్రీహరి ఎలా అడ్డుకున్నారో పేర్కొన్నారు. వారి నుంచి లోకాన్ని రక్షించి శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పాడు.


            విష్ణువును ఆరాధించేవారిని వైష్ణువులుగా పేర్కొంటారు. శ్రీమహా విష్ణువును ఆరాధించేవారికి మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. దుష్ట శక్తుల నుంచి ప్రపంచాన్ని కృష్ణుడు ఎందుకు రక్షించాడు, భాగవత పురాణం అంతర్గత స్వభావాన్ని బట్టి, వేదాలను బట్టి తెలుసుకోవచ్చు. జ్ఞానం, ధర్మానికి మూలమైన భాగవతం హిందూ గ్రంథాల్లో చాలా ముఖ్యమైంది.

            భాగవతం ద్వారా కృష్ణుడు అత్యంత ముఖ్యమైన జీవిత పాఠాల గురించి వెల్లడించాడు. ఆనాడు బోధించిన నైతిక పాఠాలు నేటి సమాజానికి చాలా ఉపయోగ పడుతున్నాయి. జీవితంలో ముఖ్యమైన వాటిని బాధపెడితే అవి దు:ఖానికి హేతువని ఆ భగవానుడు వివరించాడు. ఈ ఐదుగురు వ్యక్తులను అవమానించినా, బాధపెట్టినా తీవ్రమైన ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారని తెలిపాడు.

1. ఆవు చాలా పవిత్రమైన జంతువు. అలాగే హిందూ మతంలో అత్యంత గౌరవమైంది కూడా. ఆవును గౌరవించని వ్యక్తులకు త్వరగా మరణం సంభవిస్తుందట.

దీనికి బలాసురుడనే రాక్షసుడు ఉదంతమే ఉదాహరణ. దేవతలకు చెందిన గోవులను హింసించిన బలూసురుని శ్రీహరి సంహరించాడు. 

2.ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరుల నమ్మకాలను కించపరిచేవాళ్లు, దైవ దూషణకు పాల్పడేవాళ్లు ఎటువంటి నేరం చేయకపోయినా తీవ్రమైన శిక్షను అనుభవిస్తారట. అహంకారంతో రాముని అవమానించిన, బెదరించిన రావణాసురుడి పరిస్థితి చివరకు ఏం జరిగిందో తెలుసుకదా.

3. విజ్ఞానానికి మూలమైన వేదాల ద్వారా జ్ఞానం వృద్ధి చెందుతుంది. అహంకారంతో వీటిని అవమానిస్తే చావు కొని తెచ్చుకున్నట్లే. రాక్షసులు ఇలాగే వేదాలను అగౌరవపరచి, వాటిని బ్రహ్మ దగ్గర నుంచి తస్కరించినప్పుడు నారాయణుడు మత్స్యావతారంలో వాటిని కాపాడాడు. వీటిని చదవడం అలవాటు చేసుకుంటే జీవితం ఆనందంగా, విజయవంతంగా సాగుతుంది. 

4.ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థాముడు అధర్మం వెంట నడిచి చావును కోరి తెచ్చుకున్నాడు.

ధుర్యోదనుడు చెప్పుచేతుల్లో ఉంటూ పాండవులను శత్రువులుగా చూసిన ఈ బ్రాహ్మణోత్తముడు చివరకు దిక్కులేని చావు చచ్చాడు. 5. రుషులు, విద్వాంసులు, పండితులను అవమానించిరాదు.


    దురాశ, అహంకారంతో దుర్యోధనుడు గురువుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాదు, గురుదక్షిణ కూడా చెల్లించలేదు. అలాగే తన విజయం కోసం గురువుతోనూ యుద్ధం చేయించాడు కూడా. రుషులను కూడా అవమానించాడు కూడా. హస్తినాపురకు వచ్చిన ఓ రుషి ధుర్యోధనుడికి ధర్మం గురించి బోధిస్తాడు. పాండవులతో వైరం వదిలిపెట్టాలని, దీని వల్ల శాంతి, స్నేహం చేకూరతాయంటూ సలహా ఇస్తాడు. దీనికి వికటట్టహాసం చేసి అతడిని అవమానిస్తాడు. చివరకు దుర్యోధనుడి దుస్థితి ఏమైందో తెలిసిందే కదా!!

Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి