మానవ జన్మ - విలువలేని ఆస్తి

         మానవ జన్మ - విలువలేని ఆస్తి 


అనేక లక్షల జీవరాసులలో మానవుడు సర్వశ్రేష్ఠుడని పరిగణింపబడిఉన్నాడు . అందువలనే మానవజన్మ లభించటం దుర్లభం అని శాస్త్రాలు చెప్తున్నాయి . మానవజన్మ నెత్తినందుకు దానికి చక్కగా ఉపయోగించుకుని , సార్ధకం చేసుకోకపోతే అది మన మూర్కత్వమే అవుతుంది . 


" అపి మానుష్యకం లబ్ధ్వా భవన్తి జ్ఞానినో నయే 

పశుతైవ వరం తేషాం ప్రత్యవాయాప్రవర్తనాత్ !! "


జ్ఞానార్జన చేయని మనుష్యునికంటే పశువులు ఎంతో మేలు అని ఈ వాక్యం చెప్తోంది . దీనికి కారణం అర్ధం చేసుకొనటం చాల తేలికే . పశువు పరిణామ క్రమంలో మరింతగా పతనం చెందటం ఉండదు . కానీ జ్ఞాన విహీనుడైన మానవుడు పాపకర్మలు ఆచరించి పతనం కావచ్చు . అందువలన ప్రతి మానవుడు జ్ఞానాన్ని పొందటానికి నిరంతర కృషి చేయాలి . అంతకంటే మానవజన్మ సార్ధకతకు మరో మార్గంలేదు . అందుకనే భగద్గీతలో భగవానుడు ఈవిధంగా చెప్పాడు . 



" నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే "


ఇక్కడ జ్ఞానమంటే ప్రాపంచిక విషయపరిజ్ఞాణంకాదు , ఆత్మతత్వజ్ఞానం అని అర్ధం . అటువంటి జ్ఞానాన్ని సంపాదించిన తరువాత , ఇక సంపాదించవలసిందంటూ ఏమి ఉండదు . 


ఆత్మజ్ఞానం వలనె అజ్ఞానం నశిస్తుంది . అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది . పరిశుద్ధమైన చిత్తమే జ్ఞానప్రాప్తి యోగ్యమవుతుంది .


మానవుడు నిరంతరం , సత్కర్మల ద్వారా మనస్సును శుద్హిగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి . ఈవిధమైన మానసిక పవిత్రత కరువైనప్పుడు , ఎవరు ఎన్నిసార్లు బోధించినా సత్యాన్ని గ్రహించటం కుదరదు . అదే చిత్తశుద్ధి ఉన్నప్పుడు , గురువు ఒకసారి బోధిస్తే చాలు జ్ఞానం లభిస్తుంది . 


" పరిపక్వమతే: సకృత్ శృతం జనయేదాత్మ ధియం శృతేర్వచః "


మనస్సును పరిశుద్ధం చేసుకోనటమెలా ? ఫలితాలపై మనస్సును నిలపకుండా , సత్కర్మలు ఆచరించటమే అందుకు మార్గం . ఫలితాలు ఆశించి సత్కర్మలు ఆచరిస్తే ఫలితాలు దక్కుతాయి కానీ చిత్తశుద్ధి మాత్రం లభించదు 


అందరు ఈ విషయాన్ని గ్రహించి శాస్త్రాలు సూచించినట్లు ఫలితాలు ఆశించకుండా సత్కర్మలు ఆచరించాలి . అప్పుడు చిత్తశుద్ధి లభించి , జ్ఞానాన్ని పొందటానికి అర్హులమవుతాం . 



Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి