వివిధ జన్మలు ఏవి.........!!
వివిధ జన్మలు ఏవి.........!!
1. దేవతలు. 2. మనుష్యులు. 3. మృగములు. 4.పక్షులు. 5. పురుగులు. 6. జలచరములు.
7. వృక్షములు
*శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?*
1. వ్రుషబాద్రి 2. నీలాద్రి 3. గరుడాద్రి. 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి. 7. నారాయణాద్రి.
*ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?*
1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.
2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.
4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై జోడించి నమస్కరించాలి.
5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.
6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
*శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?*
1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల. 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .
*🥀ధర్మం అంటే ?🥀*
ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"
*☀️సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?☀️*
సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచి వారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.
కనుకనే సహపంక్తి బోజనానినికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.
*దేవతా లక్షణాలు ఏవి ?*
1. రెప్పపాటు లేకుండుట .
2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.
3. వ్యసనం లేకుండా ఉండుట.
*నవ వ్యాకరణాలు అనగా ఏవి ?*
1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 8. శాఖటా టా యానం . 9.శాకల్యం .
*🏹శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు ?🏹*
శ్రీ రాముడు చైత్ర మాసం ,
నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .
*పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు*
భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.
ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .
*శ్రీ వారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?*
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్ట దిగ్గజాలు గా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.
*⛲పంచ కోశాలు అంటే ఏమిటి ?⛲*
1. అన్నమయ కోశం.
2. ప్రాణమయ కోశం.
3. మనోమయ కోశం.
4. విజ్ఞానమయ కోశం.
5. ఆనందమయ కోశం .
*🌌శౌచమంటే ఏమిటి ?🌌*
శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు
1. బాహ్య శౌచం.
2. అంతః శౌచం .
*భాహ్య శౌచం*
శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.
*అంతః శౌచం*
మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం.

Comments
Post a Comment