ముక్కు పుడక ఎందుకు?

స్త్రీలకు జరపాల్సిన సంస్కారాలలొ ముక్కు కుట్టించడం చాలా ప్రధానమైనది. దీనికి అధ్యాత్మికంగా, విఙ్ఞాన పరంగా కూడా చాలా కారణాలున్నాయి.

(1) ఘ్రాణ (వాసన చూసే) శక్తిలో పంచభూత తత్త్వాలు కలిసి ఉంటాయి. ప్రధానంగా ఇది భూ సంబంధమైనది. 

(2) బంగారు ధాతువు శుద్ధతకి ప్రతీక. వంట వండేటపుడు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు శుద్ధమై ఆహారం శుద్ధం అవుతుంది. కొన్ని ధర్మశాస్త్రాల ప్రకారం దైవ నివేదనకి ముక్కుపుడక లేకుండా వంట చేస్తే పనికిరాదు.   కాబట్టి ప్రతి భారతీయ మహిళ తప్పనిసరిగా ముక్కుపుడక ధరించాలి. 


(3) ప్రాణశక్తికి సంకేతమైన ఇడ పింగళ నాడులు ముక్కుపుడక వల్ల శక్తిమంతం అవుతాయి.

(4) స్త్రీలు ఎక్కువగా శుభ్రపరిచే పనులలో ఉంటారు. ఆ సమయాలలో సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే ఎన్నో వ్యాధులు రాకుండా చేస్తుంది.   

(5) మెదడులో ఉండే నాడీ వ్యవస్థని కూడా సరిచేయగల శక్తి దీనికి ఉంది.

(6) కంటికి కనిపించని దుష్ట శక్తులు శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడుతుంది.


Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి