లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి

       లక్ష్మీ కటాక్షం లభించాలంటే......




ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను  కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి, ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి.



సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి.


సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి.


ఇంట్లో ఉండే దేవీదేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ, చందనం, పువ్వులతో అలంకరించాలి.


సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు.


ఇళ్ళు శుబ్రం చేసుకోకుండా ఉదయం అల్పాహారం తినకూడదు.


ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి.


పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే...ఒక స్పూను 

తీయని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి.


గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఎదో ఒకటి దానం చేయండి, 

దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి.


ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి.


తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే 

లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.


ఆర్థికపరమైన పనుల నిమిత్తం..

బయటకు వెళ్ళేముందు లక్ష్మీ సంబంధమైన యంత్రాలను కాని శ్రీ వినాయకుడిని కానీ దర్శించుకుని వెళ్ళాలి.


శ్రీమహాలక్ష్మీదేవికి తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించాలి.


సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో 

ముఖం తూర్పువైపు లేదా పశ్చిమంవైపు 

ఉండేలా చూసుకోండి.


ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రపరచుకోవాలి, సాలెగూళ్ళు, మట్టి, చెత్త విరిగిపోయిన వస్తువులను సర్థుకోవాలి.


సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయకూడదు.


  గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు.


శుక్రవారంనాడు.. ఉదయాన్నే..ఇంటి సింహద్వారం గడపకు..(ఇంట్లోని గడపలకు కూడా)

తులసి కోటకు.. పసుపురాసి..బొట్లు పెడితే..

లక్ష్మీ అనుగ్రహముతో పాటు..

ఇంట్లోని పిల్లలు వృద్ధిలోకి వస్తారు..

చెప్పినమాట వింటారు.

కొడుకులున్నవారికి..అణుకువ ఉన్న కోడళ్ళు..

కూతుర్లున్నవారికి..కొడుకుల్లాంటి..అల్లుళ్లు వస్తారు.


*పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి.*



Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?