బిక్షగాడు మీ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అన్నప్పుడు మీకు ఒక హెచ్చరిక
బిక్షగాడు మీ ఇంటి ముందు నిలబడి, “భవతీ భిక్షాం దేహి” అన్నప్పుడు మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాడని గ్రహించాలి. “నేను పూర్వజన్మలో బిక్షగానికి అన్నం పెట్టలేదు. బిక్షగానిని నా పుత్రునిగా భావించలేదు. కనుకనే, నేను ఈనాడు బిక్షగానిగా పుట్టాను. మీరు వచ్చే జన్మలో నావలె బిక్షగాళ్ళు కాకండి” అని హెచ్చరిస్తున్నాడని గుర్తించాలి. ఐతే, తాను బిక్షం ఎవరిని అడుగుతున్నాడు? “బిక్షాం దేహి” అంటున్నాడు. 'దేహి' అనేది దైవం యొక్క పేరే. తాను దైవాన్ని బిక్షమడుగుతున్నాడు. అందరూ దైవాన్ని బిక్షమడుగవలసిందే! ధనము, విద్య, వివేకము మొదలైన వాటిని మీకు ఇచ్చేవాడు దైవమే! కనుక, మీరు దైవం నుండి పొందినవాటిని ఇంకొకరికి కూడా అందించాలి. మీరు పొందిన విద్యను ఇతరులకు బోధించాలి. మీరు సంపాదించిన ధనమును దానం చేయాలి. అప్పుడే విద్యగాని, ధనముగాని మీవద్ద శాశ్వతంగా నిలుస్తాయి. “త్యాగేనైకే అమృతత్వ మానశుః” త్యాగమే అమృతత్వాన్ని చేకూర్చుతుంది."🙏