Posts

Showing posts from May, 2022

ఈ మంత్రం పోయినవాటిని తిరిగి తెస్తుంది

Image
     ఈ మంత్రం పోయినవాటిని తిరిగి తెస్తుంది                 ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా,    భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా ఒకేఒక మంత్రం *’నిరంతరం’* స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. *ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే కార్తవీర్యార్జున మంత్రం.* స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే  పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి.  డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా  ‘మొత్తానికి సమస్య ఏదైనా’ పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు మన పండితులు. *ఆ మంత్రం ఈ విధం ఉంటుంది:* *ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్*  *తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే* ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తా...

ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవి ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు

Image
   *గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం* గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాధాన్యత ఉందో  గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు.  దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది.  గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు.  గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని,  శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు.  గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా  ప్రత్యక్ష సంబందం ఉంది.  శివునికి చేసే అష్టాదశ అలంకరణలో  గవ్వలుకూడ ఉంటాయి.  శివుని జటాజూటంలోను,  శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి.  గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది.  పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు." అని ఉంది.  కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక,  ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం. 1) పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను  వారి మెడలోగాని,మొలతాడులోగా...

నర్మదా నది ప్రతి రాయిలో శివుడు ఉన్నాడు, ఎందుకు?*

Image
నర్మదా నది ప్రతి రాయిలో శివుడు ఉన్నాడు, ఎందుకు?   నర్మదేశ్వర్ శివలింగానికి సంబంధించి ఒక మతపరమైన కథ ఉంది - గంగా, యమునా, నర్మద మరియు సరస్వతి భారతదేశంలోని నాలుగు ఉత్తమ నదులు.  వాటిలో కూడా గంగానదికి సమాంతరంగా ఈ భూమి మీద నది లేదు.  పూర్వకాలంలో నర్మదా నది చాలా సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టింది.  సంతోషించిన బ్రహ్మ అతనిని వరం అడగమని అడిగాడు.  అప్పుడు నర్మదాజీ ఇలా అన్నారు - 'బ్రహ్మా!  నీవు నా పట్ల ప్రసన్నుడైతే నన్ను గంగాజీలా చేయి, కాశీపురికి మరే ఇతర నగరమైనా సాటి రాగలిగితే, మరే ఇతర నది కూడా గంగానదిలా ఉంటుంది.  బ్రహ్మదేవుని మాటలు విన్న నర్మద తన వరాన్ని త్యజించి కాశీకి వెళ్లి అక్కడ పిపిలతీర్థంలో శివలింగాన్ని స్థాపించి తపస్సు చేయడం ప్రారంభించింది.  శంకర భగవానుడు వారిని చూసి చాలా సంతోషించి వరం కోరమని అడిగాడు.  అప్పుడు నర్మద చెప్పింది - 'ప్రభూ!  పనికిమాలిన వరం అడగడం వల్ల ప్రయోజనం ఏమిటి?  నా భక్తిని నీ పాద పద్మముల వద్ద ఉంచుము.  నర్మదా మాటలు విని శంకరుడు చాలా సంతోషించి ఇలా అన్నాడు - 'నర్మదే!  నీ ఒడ్డున ఉన్న బండరాళ్లన్నీ నా పెం...

కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి.? అంటే ఫలితమేమిటి?

Image
కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి.? అంటే ఫలితమేమిటి? ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి.  చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో  ఉండిపోవలసిందేనా?  లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే  గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.  అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.  మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము. రెండోది ఫలత్యాగం...

కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మల మూత్ర విసర్జన చేసుకొని వదిలి వెళ్ళటం ఇలా 3సార్లు జరిగింది..

Image
 కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్ళీ వదిలి వెళ్ళటం ఇలా  3సార్లు జరిగింది... "మృదంగ శైలేశ్వరి ఆలయం"  అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. కేరళ శాస్త్రీయ నృత్యం "కథాకళి" ఇక్కడే ఉద్భవించింది. దీనిని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు. ఇక్కడ ప్రధాన దేవి దుర్గను "మిఝావిల్ భగవతి"  అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి "మృదంగ శైలేశ్వరి" అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది.  ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయింది అని చెప్తారు. ఇక్కడే శక్తి లేదా దేవి యొక్క ఉనికిని కనుగొన్న పరశురాముడు ఆమెను విగ్రహం లోకి ఆహ్వానించి ఆమె కోసం ఆలయాన్ని స్థాపించాడు అని స్థలపురాణం.   ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే, నాలుగుసార్లు, దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగిలించారు, కానీ వారు దానితో ఎక్కువ దూరం వెళ్ళలేకపోవడంతో దానిని వెనక్కి తిరిగి ఇచ్చా...

హనుమాన్ జయంతి రోజున ఏమి చేయాలి..పూజ ఎలా చేసుకోవాలి

Image
 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸 *🔅25-5-2022 వైశాఖ బహుళ దశమి బుధవారం హనుమాన్ జయంతి / హనుమజ్జయంతి.🔅* *శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత.* జీవితంలో ఒక్కసారైనా హనుమజ్జయంతి చేసుకోవాలి చేసుకోకపోతే మానవ జన్మ వ్యర్థం అని శాస్త్ర వచనం. *🔅హనుమాన్ జయంతి రోజున ఏమి చేయాలి.*🔅 *🔅సనాతన ధర్మంలో హనుమంతుని ప్రాముఖ్యత.*🔅  *🔅హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేయాలి? *🔅 జీవితంలో ఒక్కసారైనా హనుమజ్జయంతి చేసుకోవాలి చేసుకోకపోతే మానవ జన్మ వ్యర్థం అని శాస్త్ర వచనం.  హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క హనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది. భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వర...

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ స్థలపురాణం

Image
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ స్థలపురాణం   🌼దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టల్లో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా అంజన్న కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాననుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరిచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికి అవధుల్లేవు. భక్తిభావంతో కోరంద ముళ్లపొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్యభాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆనవాళ్లున్నాయి. శ్రీరాముడు సీతకోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్చిల్లిపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు పురాణగాథను చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారిపక్కన సీతాదేవి ఏడ్చినట్లు చెప్పే కన్నీటి గుంతలు భక్తులకు దర్శనమిస్తాయి. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆ...

కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా...!!

Image
 కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా.....!! ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటే....... సాధారణంగా మన వస్తువులను సంపదను భద్రపరుచుకోవడానికి ఇల్లు కట్టుకుని దానికి తలుపులు వేయిస్తాం. అయితే ప్రపంచంలో ప్రస్తుతం నివాసయోగ్యంగా ఉన్న కేవలం ఒక్క గ్రామంలో మాత్రం ఇల్లకు ఎటువంటి తలుపులు ఉండవు. కేవలం ప్రజల ఇళ్లకే కాకుండా పోస్టాఫీసు, ఆసుపత్రి తదితర ప్రభుత్వ భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు. అక్కడ ఉన్న ఒక దైవం తమ సంపదను రక్షిస్తోందన్న నమ్మకమే ప్రజలను ఇంటికి తలుపులు చేయించడం లేదు. ఇది పది, పదిహేనేళ్ల నాటి సంగతి కాదు. కలియుగం మొదటి నుంచి కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. ప్రజలు పక్క ఊరికి వెళ్లినా కూడా ఇంటికి తలుపులను బిగించి వెళ్లరు. గొళ్లెం, తాళాల ఊసే లేదు. ఈ గ్రామం మన దేశంలోనే ఉంది. ఆ గ్రామం ఏమిటి ఎక్కడ ఉంది, దిని విశిష్టతలు తదితర విషయాలకు సంబంధించిన కథనం పాఠకుల కోసం... 1. అనంత స్వరూపడని చెప్పే క్రమంలోనే మహారాష్ట్రలోని, శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ముఖ్య పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆ పరమాత్ముడు అరుబయటనే ఉంటాడు. ఎటువంటి ప్రత్యేక దేవాలయం ఉండక పోవడం ఇక్కడ ఉన్న విశిష్టత. తాను అన...

వివిధ జన్మలు ఏవి.........!!

Image
వివిధ జన్మలు ఏవి.........!! 1. దేవతలు. 2. మనుష్యులు. 3. మృగములు. 4.పక్షులు. 5. పురుగులు. 6. జలచరములు. 7. వృక్షములు   *శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?*    1. వ్రుషబాద్రి 2. నీలాద్రి 3. గరుడాద్రి. 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి. 7. నారాయణాద్రి.  *ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?* 1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి. 2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి. 3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి. 4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి. 5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి. 6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.   *శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?* 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల. 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .  *🥀ధర్మం అంటే ?🥀...

ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే ప్రమాదా?

Image
        ఒంటి బ్రాహ్మణుని ఎదురు పడితే... ఆమధ్య ఒక పెద్దమనిషి ఇంటిలోంచి బయటకు వెల్తున్నాడు, ఒక బ్రాహ్మణ కులస్థుడు ఎదురు పడ్డాడు. "బ్రాహ్మణుడి ఎదురేంటిరా బాబూ ఇయ్యేల" అంటూ మళ్లీ వెనక్కి ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఊరి పెద్ద అక్కడే ఉండడం తటస్థించింది. ఆయన మామూలుగా ఆ ఎదురు శంక లేకుండా హాయిగా బయటకు వెళ్లేరు. తరువాత ఆ పెద్దమనిషి అదేంటండీ బ్రాహ్మణుని ఎదురు మంచి శకునం కాదు అంటారు కదా. మీరేమిటి గమనించలేదా అని అడిగాడు.  అప్పుడు ఆయనను స్థిమితంగా కూర్చోబెట్టి ఊరి పెద్ద ఆయనకు ఏం చెప్పేరంటే.. చాలామందికి ఈ అపోహ ఉంది. ఇదే విషయాన్ని నేను లోగడ ఒక వైష్ణవ పండితుని అడిగేను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు సముచితంగా తోచింది.. ఒంటి బ్రాహ్మణుడు కాదు. ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పూర్వం గురుకులాలలో ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యనభ్యసిస్తున్న బ్రహ్మచారుల ను బిక్షాటనకు పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోని గృహాల నుండి బిక్ష సేకరించేవారు.  అటువంటి బ్రహ్మచారి ఎదురయితే ఆయనను సాదరంగా ఆహ్వానించి బిక్షవేసి సాగనంపాలి. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురయి నప్పుడు ఆయనను నిర్ల...

మానవ జన్మ - విలువలేని ఆస్తి

Image
         మానవ జన్మ - విలువలేని ఆస్తి  అనేక లక్షల జీవరాసులలో మానవుడు సర్వశ్రేష్ఠుడని పరిగణింపబడిఉన్నాడు . అందువలనే మానవజన్మ లభించటం దుర్లభం అని శాస్త్రాలు చెప్తున్నాయి . మానవజన్మ నెత్తినందుకు దానికి చక్కగా ఉపయోగించుకుని , సార్ధకం చేసుకోకపోతే అది మన మూర్కత్వమే అవుతుంది .  " అపి మానుష్యకం లబ్ధ్వా భవన్తి జ్ఞానినో నయే  పశుతైవ వరం తేషాం ప్రత్యవాయాప్రవర్తనాత్ !! " జ్ఞానార్జన చేయని మనుష్యునికంటే పశువులు ఎంతో మేలు అని ఈ వాక్యం చెప్తోంది . దీనికి కారణం అర్ధం చేసుకొనటం చాల తేలికే . పశువు పరిణామ క్రమంలో మరింతగా పతనం చెందటం ఉండదు . కానీ జ్ఞాన విహీనుడైన మానవుడు పాపకర్మలు ఆచరించి పతనం కావచ్చు . అందువలన ప్రతి మానవుడు జ్ఞానాన్ని పొందటానికి నిరంతర కృషి చేయాలి . అంతకంటే మానవజన్మ సార్ధకతకు మరో మార్గంలేదు . అందుకనే భగద్గీతలో భగవానుడు ఈవిధంగా చెప్పాడు .  " నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే " ఇక్కడ జ్ఞానమంటే ప్రాపంచిక విషయపరిజ్ఞాణంకాదు , ఆత్మతత్వజ్ఞానం అని అర్ధం . అటువంటి జ్ఞానాన్ని సంపాదించిన తరువాత , ఇక సంపాదించవలసిందంటూ ఏమి ఉండదు .  ఆత్మజ్ఞానం వలనె అజ్ఞ...

ఏ దానం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది

Image
 దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు 1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి. 2. వెండిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది. 3. బంగారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి. 4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి. 5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది. 6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు. 7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు. 8. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది. 9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది. 10. టెంకాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది. 11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది. 12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. 13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది 14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది. 15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది. పైవన్నీమన వేదాల్లో చెప్పినవే… వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.

పూజ చేసుకునే పద్ధతి

Image
 పూజ చేసుకునే పద్ధతి  భక్తులు అనేవారు నిత్యం లేదా వారానికొకసారైనా ఇంట్లో పూజలు చేస్తారు. అయితే ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి. నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.  ఎడమ చేతితో ఉద్ధరిణె నీళ్ళు తీసుకొని కుడిచేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మీసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.  గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకును ఎట్టి పరిస్థితులలోనూ నేలపై ఉంచరాదు. పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు. పూజలో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది.  తూర్పు-ఉత్తర దిక్కుల అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది. ఒంటి చేయిచాచి తీర్థాన్ని స్వీకరించరాదు. చేతిక్రింద వస్త్రాన్నుంచుకొని, శ్రద్ధగా స్వీకరించాలి. వస్త్రం లేని పక్షంలో చేతికింద చేతినుంచాలి. సాధ్యమైనంతవరకు నిలబడి తీర్థ ప్రసాదాలను స్వీకరించరాదు.   తీర్థం స్వీకరించేటప్పుడు చప్పుడు కాకుండా చూసుకోవాలి. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని తలపై రాసుకోరాదు. పూజలకు, జ...

భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే స్మారక చిహ్నాల వివరాలు

Image
భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే స్మారక చిహ్నాల వివరాలు స్మారక చిహ్నాలు, క్లిష్టమైన నమూనాలు మన దేశం ఇంజనీరింగ్ నైపుణ్యానికి,  హస్తకళాకారుల పరిపూర్ణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. వీటిలో కొన్ని స్మారక చిహ్నాలు మన దేశ కరెన్సీ నోట్లలో  చోటు సంపాదించాయి.  ఈరోజు అటువంటి స్మారక చిహ్నాలను కలిగి ఉన్న కరెన్సీ నోట్ల గురించి  భారతదేశం విభిన్న సంస్కృతులు , సంప్రదాయాలతో కూడిన సువిశాల దేశం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భిన్న సంప్రదాయాలు, భాషలు, సామాజిక అలవాట్లను కలిగి ఉంది. ఈ వైవిధ్యమే ఆయా ప్రాంతాల్లో అక్కడ సంస్కృతికి సంప్రదాయాలకు చిహ్నంగా విభిన్న నిర్మాణ స్మారక చిహ్నాలను నిర్మించారు. ఆ నిర్మాణాలు  భారతదేశం గర్వించగలిగేలా చేశాయి. ఆ స్మారక చిహ్నాలు, క్లిష్టమైన నమూనాలు మన దేశం ఇంజనీరింగ్ నైపుణ్యానికి,  హస్తకళాకారుల పరిపూర్ణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. వీటిలో కొన్ని స్మారక చిహ్నాలు మన దేశ కరెన్సీ నోట్లలో  చోటు సంపాదించాయి.అటువంటి స్మారక చిహ్నాలను కలిగి ఉన్న కరెన్సీ నోట్ల వివరాలు. *10 రూపాయల నోటు:* జనవరి 5, 2018న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ ) ముద్రించి...

మానవ శరీరము - నిత్య జీవితం

  మానవ శరీరము - నిత్య జీవితం 🍃🥀ఈ శరీరం ఎప్పుడూ ఇలాగే ఉండేది కాదు, ఇప్పుడు అందంగా, బిగువుగా, ఆకర్షణీయంగా ఉన్న శరీరం కొంతకాలం గడిచేసరికి సడలిపోతుంది, కృశించిపోతుంది, అందవిహీనమౌతుంది, చివరకి రాలిపోతుంది. ఈ విషయాన్ని మనం మరువరాదు, ఈ శరీరం నేను కాదు. 🍃🥀ఇది కేవలం నేను వాడుకొనే పరికరం మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నా వాచీని నేను ఎలా జాగ్రత్తగా వాడుకుంటున్నానో, దానిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నానో, అది చెడిపోతే ఎలా రిపేరు చేయించుకుంటున్నానో, కొత్త పార్టులు అమర్చుకుంటున్నానో, అలాగే ఈ శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి. 🍃🥀దుస్తులు వేయాలి, పోషించాలి, అందంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, అవసరమైతే చెడిపోయిన అవయవాలను తొలగించి కొత్త అవయవాలను వేయాలి.   అయితే ఒక ముఖ్య విషయాన్ని మాత్రం మరచిపోకూడదు. 🍃🥀ఇది మన కోసం వాడుకోవాల్సిన పరికరమని, ఒక ముఖ్యమైన పని కొరకు వినియోగించవలసిన సాధనమని, ఇది శాశ్వతంగా ఉండేది కాదని, కనుక తెలివిగా, జాగ్రత్తగా వినియోగించు కోవాల్సినదని జ్ఞాపకం ఉంచుకోవాలి. 🍃🥀సత్యశోధనకై, సమాజ శ్రేయస్సుకై, పరమాత్మ అనుగ్రహానికై దీనిని వినియోగించాలి. అంతే గాని శరీరాన్ని పోషి...

★ ఇది కదా ప్రగతి.. పల్లెల పురోగతి ★ మన పల్లెలు తెలంగాణ ప్రగతి కొమ్మలు.. రూపురేఖలు మారిపోయిన పంచాయతీలు

Image
 ★ ఇది కదా ప్రగతి.. పల్లెల పురోగతి  ★ మన పల్లెలు తెలంగాణ ప్రగతి కొమ్మలు..       రూపురేఖలు మారిపోయిన పంచాయతీలు ★ పరుచుకొన్న పచ్చదనం..       పరిశుభ్రంగా పల్లెదనం..       దేశంలో ఎక్కడాలేని మౌలిక సదుపాయాలు ★ దేశంలో టాప్‌ 20లో 19 గ్రామాలు మనవే..       అన్ని రంగాల్లోనూ మన గ్రామాలకే       జాతీయ అవార్డులు ఇవాళ గాంధీజీ జీవించి ఉంటే తెలంగాణ పల్లెలను చూసి ఎంత సంబురపడిపోయేవారో.. తాను కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమైన ఊళ్లను చూసి ఎంత మురిసిపోయేవారో.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యాచరణలో దేశానికే రోల్‌మోడల్‌లా విజయవంతమైంది. పల్లెలు అద్దాల్లా మెరుస్తున్నయి. పాతగోడలు, పాడుబడిన బావులు పోయి సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు కనపడుతున్నయి. హరితహారం మొక్కలతో పచ్చలహారంగా మారిపోయాయి. వేలాడే విద్యుత్తు తీగల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నయి. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, రైతు వేదికలు, ఇంటింటికీ మిషన్‌ భగీరథ నల్లాల్లో శుభ్రమైన నీరు. మిషన్‌ కాకతీయతో కళకళలాడ...

అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయా.. ఐతే ఈ గణపతిని ఇలా మొక్కండి

Image
అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయా...... ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోవడం, రావలసిన డబ్బులు, ఉద్యోగాలు, లాభాలు చేతిదాకా వచ్చి చేయిదాటిపోవడం జరుగుతోందా? అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం తరుణ గణపతిని పూజించడం. వినాయకుని ముప్ఫైరెండు రూపాలలో తరుణ గణపతి రూపం రెండవది. తరుణ అంటే యవ్వనం అని అర్థం. తరుణ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో విరాజిల్లుతాడు. ఈ రూపం లో స్వామికి ఎనిమిది చేతులు ఉంటాయి. కుడిపక్కన ఒక చేతిలో దంతాన్ని, మరొకచేత జామపండుని, ఒక చేత చెరుకు గడలని, మరొక చేత అంకుశాన్ని ధరించి ఉంటాడు. ఎడమవైపున ఒకచేత మోదకాన్ని, ఒకచేత వెలగ పండునీ,ఒకచేత లేత మొక్కజొన్న కంకుల పొత్తినీ, మరొక చేత వలనీ ధరించి ఉంటాడు. తరుణ గణపతి శరీరం కాంతివంతంగా ఎర్రని రంగులో ఉంటుంది. ఎరుపు ఉత్తేజానికీ యవ్వనానికీ ప్రతీక. మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్సుతో తరుణ గణపతి దర్శనమిస్తాడు. వినాయకునికి ప్రీతికరమైన బుధవారం నాడు, సంకష్ట చతుర్థినాడు, వినాయక చవితినాడు, దూర్వా గణపతి వ్రతం నాడు స్వామిని తరుణ గణపతి రూపం లో పూజించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. అనుకున్న కార్యాలు సత్వరం...

ముట్టుకొంటే మానవ శరీరం లాగా మెత్తగా అనిపించే శ్రీ నరసింహస్వామి వారు

Image
ముట్టుకొంటే మానవ శరీరం లాగా మెత్తగా అనిపించే శ్రీ నరసింహస్వామి వారు... తెలంగాణ      హేమాచల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మల్లూరు గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఉంది.     వరంగల్లు కి 130కిమి, భద్రాచలం కి 90  కిమి దూరంలో ఉంది.  ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు.     స్వామి విగ్రహం 10 అడుగుల ఎత్తు. స్వామి విగ్రహం రాయి తో చేసినా ఉదర భాగం మెత్తగా మానవ శరీరంలాగా ఉంటుంది.     స్వామి సకల కోరికలూ తీరిచే అద్భుత మహత్యం కల వారు.      అమ్మవార్లు ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి. క్షేత్ర పాలిక కి అష్టాదశ హస్తాలు          ఇక్కడ చింతామణి తీర్థంలోని నీళ్ళు సకల రోగ నివారణ చేయ గలవు.    ఇక్కడి ప్రజల కథనం ప్రకారం రావణుడు ఈ ప్రాంతాన్ని చెల్లెలు శూర్ఫనఖకి కానుకగా ఇచ్చాడు.     ఇక్కడే రాముల వారు ఖర దూషణాదులను మట్టు పెట్టారు.    అగస్త్యుల వారు ఈ ప్రాంతానికి హేమాచలమని పేరు పెట్టారు.     ఈ క్షేత్రం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది . చుట్టూ అడవి  మద్య...

సుప్రభాతంలో తెర వెనకాల ఏం చేస్తారు?

Image
   సుప్రభాత సేవ సమయంలో భక్తుల్ని బంగారువాకిలి ముందు నిలబెట్టి, ఆ వాకిలికి తెరవేసేసి, అలా కొంతసేపు వుంచేస్తారు. ఆ సమయంలో తెరవెనకాల గర్భాలయంలోఏం జరుగుతుంది. అన్నది భక్తులకి ఉత్కంఠ కలిగించే విషయం.  అక్కడ ఏం జరుగుతుందంటే... సుప్రభాత సేవను విశ్వరూపసేవ అనికూడా అంటారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ జరగడానికి ముందు గొల్ల మిరాశీదారు వెళ్లి అర్చకులను లేపడం, తర్వాత జియ్యంగారిని లేపడం, దివిటీలతో వారిని ఆలయానికి తీసుకురావడం సంప్రదాయం. ఆలయ అధికారులు, పూర్వకాలంలో పారుపత్తేదారు, ఇప్పుడు ఆలయం పేష్కారు (సహాయ కార్యనిర్వహణాధికారి) అయినాఈ సమయానికి ఆలయానికి రావాలి. అర్చకులు, ముఖ్యంగా గుడికి రాకముందే స్నానాదులు ముగించి, తమ కర్మానుష్ఠానం చేసిన తర్వాతే, ఆలయానికి రావాలన్నది నియమం. అదే నియమం జియ్యంగార్ల విషయంలో కూడా. ఎందుకంటే వీరిద్దరూ గర్భాలయంలోకి వెళ్లే అవసరంవుంది. వారిలో అర్చకునికే స్వామివారిని ముట్టే అవకాశం ఉంటుంది. జియ్యంగారు లేదా వారి తరఫున ఏకాంగులకు గర్భాలయంలోకి వెళ్లే అధికారమున్నా, వారికి స్వామి వారిని తాకే హక్కులేదు. ఆలయ అధికారులు, కావల్సిన దిట్టం (పూజకు కావాల్సిన సరంజామా) లెక్కప్రకారం ఇచ్చ...

నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి

Image
నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి      ఈ మధ్యకాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మములోనూ చెప్పబడలేదు. ఈమధ్యకాలంలో క్రొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని, దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తున్నాం అయిపోయింది అని ఇటువంటి భావజాలం క్రొత్తక్రొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ సత్యదూరాలు. ఆలయంలోనికి వెళ్ళే పూర్వమే కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే ఇంటిలోనుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి, పూలు, పూజాసామగ్రి తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి. నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని, తరువాత ప్రధాన దేవాలయానికి, అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఉప ఆలయాలలో ఇతర దేవీదేవతల దర్శనం చేసుకొని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్...

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

Image
 భగవధ్గీతలో ఏముంది?:  *ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?* గీత ఎప్పుడు పుట్టింది? భారతదేశ చరిత్రలో మహాభారత యుధ్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుధ్ధం జరిగిన తర్వాత 36 సంవత్స రాలకు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది!! యుధ్ధ సమయంలో శ్రీకృష్ణుని వయస్సు 90 సం!!రాలు!! శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన నాటి నుండి కలి ప్రవేశం జరిగింది!! అంటే కలియుగం ప్రారంభమైనది!! శ్రీకృష్ణ భగవానుడు దాదాపు126 సంవత్సరాలు జీవించి యున్నాడు!! భారత యుధ్ధ విజయం తర్వాత ధర్మ రాజు పట్టాభిషిక్తుడైనాడు కృష్ణ నిర్యాణ వార్త విన్న తరువాత పాండవులు ద్రౌపదీ సహితంగా "మహా ప్రస్థానము" గావిస్తూ హిమాలయాలకు వెళ్లారు!! అంటే యుధిష్టురుడు హస్తినాపుర సింహానముపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా 36 వర్షాలు పాలించాడు!! మహాభారత యుధ్ధము "కురుక్షేత్రము"లో 18రోజులుజరిగింది!! కార్తీక అమావాస్య రోజు మహభారత యుద్ధం ప్రారంభమైనది!! 10 రోజులు భీష్ముడు రణం చేసి పదవరోజున నేలకొరిగాడు!! 11వ రోజున అంటె మార్గశిర శుధ్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభలో ధృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు!! ఆవిధం...

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి

Image
        లక్ష్మీ కటాక్షం లభించాలంటే...... ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను  కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి, ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి. సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి. సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి. ఇంట్లో ఉండే దేవీదేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ, చందనం, పువ్వులతో అలంకరించాలి. సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు. ఇళ్ళు శుబ్రం చేసుకోకుండా ఉదయం అల్పాహారం తినకూడదు. ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి. పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే...ఒక స్పూను  తీయని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఎదో ఒకటి దానం చేయండి,  దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి. ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి. తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే  లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆర్థికపరమైన పనుల నిమిత్తం.. బయటకు వెళ్ళేముందు లక్ష్మీ సంబంధమైన యంత్రాలను కాన...